రచయితగా మారిన రిక్షావాలా!Thu,February 8, 2018 05:27 PM
రచయితగా మారిన రిక్షావాలా!

ఓ రిక్షావాలా ఏం చేయగలడు. తనకు మూడు పూటల తిండి దొరకాలంటే రిక్షాను రాత్రనకా.. పగలనకా నడపాల్సిందే. లేదంటే పస్తులుండాల్సిందే. ఎన్ని ఎండ్లయినా అదే బతుకు. కాని.. రిక్షావాలా బతుకు ఇంతేనా? కాదు అంతకు మించి.. అని అనుకున్నాడు కోల్‌కతాకు చెందిన మనోరంజన్ బ్యాపారీ. అవును. అందుకే... ఉన్నత చదువులు చదివినా అక్షరం ముక్క రాయలేని వాళ్లు ఉన్న ఈరోజుల్లో... అక్షరం ముక్క చదవకున్నా పుస్తకాలు రాస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్న ఆ రిక్షావాలా స్టోరీ తెలుసుకుందామా..

మనోరంజన్ బ్యాపారీ.. రిక్షావాలా. కోల్‌కతాలోని బిజీ రోడ్లపై తన రిక్షా పరుగులు పెడితేనే... తన కడుపులో ఇంత ముద్ద పడేది. ఓ రోజు ఓ ప్యాసెంజర్‌ను తన రిక్షాలో ఎక్కించుకొని వెళ్తున్నాడు. ఆ ప్యాసెంజర్ చూస్తే చదువుకున్న వ్యక్తిలా, ఉన్నతంగా కనిపించడంతో... మేడం.. 'జిజిబిషా' అంటే ఏంటి అని అడిగాడు. అది బెంగాలీ పదం. 'బతకాలనే కోరిక' అని ఆ ప్యాసెంజర్ చెప్పింది. ఇంతకీ.. ఆ పదాన్ని నువ్వు ఎక్కడ విన్నావు. అని ఆమె అడిగింది. పుస్తకంలో చూశా మేడం అని బదులు చెప్పాడు. ఎంతవరకు చదువుకున్నావు అని ఆమె మళ్లీ అడిగింది. దానికి తాను స్కూల్ మెట్లే ఎక్కలేదన్నాడు. అతడి అభిరుచి, జిజ్ఞాసకు ఇంప్రెస్ అయిన ఆమె.. ఓ పేపర్ తీసుకొని తన పేరు, అడ్రస్ రాసి అతడికి ఇచ్చి... స్టోరీలు రాయడంపై ఆసక్తి ఉంటే నన్ను కలువు అని చెప్పి వెళ్లిపోయింది. ఇక.. ఆ పేపర్ తెరిచి చూస్తే అందులో ఉన్న పేరు.. మహాశ్వేతాదేవి. ఆమె ఎవరో కాదు. ఆ రిక్షావాలా చదివిన పుస్తకం అగ్నిగర్భాను రాసింది ఆమే. పెద్ద రచయిత. చాలా పుస్తకాలు ఆమె రాసింది. ఆమె రాసిన ఎన్నో పుస్త‌కాల‌ను ఆయ‌న చ‌దివాడు. అలా... రిక్షావాలా రచయిత కావడానికి బీజం పడింది.

ఆమె నిర్దేశంలో.. 'ఐ డ్రైవ్ ఏ రిక్షా' అనే ఓ స్టోరీని బ్యాపారీ రాశాడు. ఆ స్టోరీ.. దేవీ పబ్లిష్ చేసే బెంగాలీ మేగజైన్ 'బర్తికా'లో 1981లో ప్రచురణకు నోచుకున్నది. ఇక.. అప్పటి నుంచి బ్యాపారీ వెనకకు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. దేవీ సూచనలతో బ్యాపారీ చాలా పుస్తకాలు రాశాడు. బెంగాలీలో దలిత్ లిటరేచర్‌పై చాలా పుస్తకాలు రాశాడు. రీసెంట్‌గా తన ఆటోబయోగ్రఫీపై కూడా ఓ పుస్తకం రాశాడు బ్యాపారీ. దీంతో కోల్‌కతా ఏరియాలోనే కాదు దేశవ్యాప్తంగా బ్యాపారీ చాలా ఫేమస్ అయిపోయాడు. దీంతో ఆయనను 11వ జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్‌కు ఆహ్వానించారు. ఆ ఫెస్టివల్‌లో తన గురించి.. తాను రచయితగా ఎలా మారాడో.. తన జీవితం ఎలా మారిపోయిందో చెప్పి.. అక్కడికి వచ్చిన అతిథులందరితో శెభాష్ అనిపించుకున్నాడు.

1670
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Union Budget 2018