సున్నా మిస్ అయింది.. కోటి ఇప్పించండి!Wed,September 13, 2017 12:44 PM
సున్నా మిస్ అయింది.. కోటి ఇప్పించండి!

ముంబై: టెన్నిస్ స్టార్ లియాండ‌ర్ పేస్, త‌న మాజీ భార్య రియా పిళ్లై వ్య‌వ‌హారం కోర్టుకెక్కిన సంగ‌తి తెలిసిందే. పేస్ నుంచి త‌న‌కు ప‌రిహారం ఇప్పించాల్సిందిగా రియా కోర్టును కోరుతున్న‌ది. అయితే ఆమె లాయ‌ర్లు చేసిన చిన్న త‌ప్పు ఆమెకు పెద్ద షాకే ఇచ్చింది. నిజానికి పేస్ నుంచి రియా కోటి ప‌రిహారం అడుగుతుండ‌గా.. ఆమె లాయ‌ర్లు పొర‌పాటున ఒక సున్నా త‌క్కువ‌గా వేసి పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీంతో కోటి కాస్తా.. ప‌ది ల‌క్ష‌లు అయింది. నిన్న బాంద్రా కోర్టులో జ‌రిగిన విచార‌ణ‌లో భాగంగా చేసిన పొర‌పాటును తెలుసుకొని మ‌రోసారి కోర్టుకు విన్న‌వించారు ఆమె త‌ర‌ఫు లాయ‌ర్లు. అది పది ల‌క్ష‌లు కాదు కోటి అని వివ‌ర‌ణ ఇచ్చారు. నిన్న జ‌రిగిన విచార‌ణ‌కు పేస్ త‌న తండ్రి వెస్ పేస్‌తో క‌లిసి వ‌చ్చాడు. అయితే రియా మాత్రం త‌న తల్లి ఆసుప‌త్రిలో ఉందంటూ వ్య‌క్తిగ‌త‌ హాజ‌రు నుంచి మిన‌హాయింపు తీసుకుంది. పేస్ నుంచి భ‌ర‌ణం కింద నెల‌కు రూ.2.6 ల‌క్ష‌లు కోరింది రియా పిళ్లై. లేదంటే ఒకేసారి రూ.1.43 కోట్లు ఇవ్వాల‌ని ఆమె డిమాండ్ చేస్తున్న‌ది. 2014లో పేస్‌పై గృహ హింస కేసు వేసింది రియా పిళ్లై. అయితే ఈ ఏడాది జులైలో దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. కేసును ఆర్నెళ్ల‌లోగా తేల్చేయాల‌ని బాంద్రా కోర్టుకు స్ప‌ష్టం చేసింది.

4425
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Union Budget 2018