రిటైర్డ్ ఎస్‌ఐని చావబాదారు.. వీడియో

Tue,September 4, 2018 12:32 PM

Retired Cop Beaten To Death In Allahabad Locals Watched

లక్నో : ఓ రిటైర్డ్ ఎస్‌ఐని ముగ్గురు వ్యక్తులు కలిసి కర్రలతో చావబాదారు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో నిన్న ఉదయం చోటు చేసుకుంది. రిటైర్ట్ ఎస్‌ఐ అబ్దుల్ సమద్ ఖాన్(70) సైకిల్‌పై వెళ్తుండగా.. రెడ్ కలర్ టీషర్ట్ ధరించిన ఓ వ్యక్తి వచ్చి కర్రతో ఆ పెద్దాయనను చితకబాదాడు. కాసేపటికే మరో ఇద్దరు వ్యక్తులు కర్రలతో కొట్టారు. స్పృహ కోల్పోయిన ఖాన్.. అక్కడే పడిపోయాడు. తీవ్ర రక్తస్రావమైంది. కొద్ది సేపటి తర్వాత ఖాన్‌ని ఆస్పత్రిలో చేర్పించారు పోలీసులు. చికిత్స పొందుతూ రిటైర్డ్ ఎస్‌ఐ మృతి చెందాడు. 2006లో ఖాన్ పదవీ విరమణ పొందారు.

మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఎఫ్‌ఐఆర్‌లో 10 మంది పేర్లను చేర్చారు. అయితే ఆస్తి వివాదాల నేపథ్యంలోనే ఖాన్‌పై దాడి చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మొదట ఖాన్‌పై దాడి చేసిన వ్యక్తిని జునైద్‌గా గుర్తించారు పోలీసులు. జునైద్‌పై 10 క్రిమినల్ కేసులు ఉన్నాయి.

2725
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles