మళ్లీ రిసార్ట్ రాజకీయాలు మొదలు..

Fri,July 12, 2019 06:23 PM

Resort politics again after CM Kumaraswamy announces trust vote

బెంగళూరు: కర్ణాటకలో మరోసారి రిసార్ట్ రాజకీయాలకు తెరలేచింది. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలను ప్రత్యేక బస్సుల్లో బెంగళూరు శివారులోని రిసార్టులకు తరలిస్తున్నాయి. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ సర్కార్‌లో భాగమైన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ఇరు పార్టీల ముఖ్యనేతలు రంగంలోకి దిగారు. మరోవైపు విశ్వాస ప‌రీక్ష‌ను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రకటించిన నేపథ్యంలో ప్రతిపక్ష బీజేపీ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా తమ ఎమ్మెల్యేలను అసెంబ్లీ ప్రాంగణం నుంచి రమదా రిసార్ట్‌కు తరలిస్తోండటం విశేషం. నేటినుంచి కర్ణాటక వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే.

594
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles