మ‌ధ్య‌వ‌ర్తిగా శ్రీశ్రీ వ‌ద్దు : అస‌దుద్దీన్‌

Fri,March 8, 2019 01:27 PM

remove Sri Sri Ravi Shankar from Ayodhya panel, demands Asad Owaisi

హైద‌రాబాద్: రామ‌జ‌న్మభూమి, బాబ్రీ మ‌సీదు భూవివాద కేసులో పండిట్ శ్రీ శ్రీ ర‌విశంక‌ర్‌ను సుప్రీంకోర్టు మ‌ధ్య‌వ‌ర్తిగా నియ‌మించింది. దీన్ని ఎంఐఎం పార్టీ చీఫ్ అస‌దుద్దీన్ ఓవైసీ వ్య‌తిరేకించారు. మ‌ధ్య‌వ‌ర్తి క‌మిటీ నుంచి ర‌విశంక‌ర్‌ను త‌ప్పించాల‌ని ఓవైసీ అభిప్రాయ‌ప‌డ్డారు. గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లో ముస్లింల‌పై ర‌విశంక‌ర్ అనుచిత వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు అస‌ద్ అన్నారు. అయోధ్య అంశంపై ముస్లింలు తగాదా మానకుంటే, భార‌త్ మ‌రో సిరియాలా మారుతుంద‌ని ర‌విశంక‌ర్ ఆరోపించారు. ఆ వ్యాఖ్య‌ల‌ను ప్ర‌స్తావిస్తూ... ప్యానెల్‌లో శ్రీశ్రీ వ‌ద్దంటూ అస‌ద్ అన్నారు. శ్రీశ్రీ బ‌దులుగా మ‌రో త‌ట‌స్థ వ్య‌క్తిని నియ‌మించాల‌న్నారు. గ‌తంలో ఈ వివాదంపై శ్రీశ్రీ అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని, అలాంటి వ్య‌క్తుల‌ను మ‌ధ్య‌వ‌ర్తిగా నియ‌మించ‌డం స‌రికాదు అని అస‌ద్ అన్నారు.

2325
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles