యూనివర్సిటీ పేర్లలో హిందు, ముస్లిం పదాలా.. తీసేయండి!

Mon,October 9, 2017 02:50 PM

Remove Hindu and Muslim words from those Universities says UGC Panel

న్యూఢిల్లీ: చదువులు చెప్పే విశ్వవిద్యాలయాల పేర్లలో మతాన్ని తెలిపే పేర్లు ఎందుకు అని యూజీసీకి చెందిన ప్యానెల్ ప్రశ్నించింది. బనారస్ హిందూ యూనివర్సిటీ, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీల నుంచి ఆ హిందూ, ముస్లిం పదాలను తొలగించాలని ఈ ప్యానెల్ సిఫారసు చేసింది. దేశవ్యాప్తంగా పది సెంట్రల్ యూనివర్సిటీల్లో జరుగుతున్న అక్రమాలపై ఆరా తీయడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఈ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. కేంద్రం నిధులు ఇచ్చే యూనివర్సిటీలు లౌకిక విద్యాసంస్థలని, వీటి పేర్లలో మతాలను తెలిపే పదాలు ఉండకూడదని ఆ ప్యానెల్ స్పష్టంచేసింది. ఈ యూనివర్సిటీలను అలీగఢ్ యూనివర్సిటీ, బనారస్ యూనివర్సిటీగా పిలవచ్చని లేదా ఆయా వ్యవస్థాపకుల పేర్లు పెట్టొచ్చని ఆ ప్యానెల్‌లో ఓ సభ్యుడు అన్నారు. ఈ రెండు యూనివర్సిటీలతోపాటు అలహాబాద్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జార్ఖండ్, రాజస్థాన్, జమ్ములలోనూ ఈ ప్యానెల్ ఆడిట్ నిర్వహించింది.

1818
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles