అక్ర‌మాస్తుల కేసు.. ములాయం, అఖిలేశ్‌కు ఊర‌ట‌

Tue,May 21, 2019 11:03 AM

Relief for Mulayam, Akhilesh as CBI Gives Clean Chit in Disproportionate Assets Case, Says No Evidence Found

హైద‌రాబాద్‌: ఆదాయానికి మించి ఆస్తులు క‌లిగి ఉన్న కేసులో స‌మాజ్‌వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాద‌వ్‌, ఆయ‌న కుమారుడు అఖిలేశ్ యాద‌వ్‌కు ఊర‌ట ల‌భించింది. ఆ కేసులో సీబీఐ ఇద్ద‌రు నేత‌ల‌కు క్లీన్ చిట్ ఇచ్చింది. ఆదాయానికి మించి ఆస్తులు క‌లిగిన కేసును 2013 ఆగ‌స్టులో మూసివేశామ‌ని సీబీఐ సుప్రీంకోర్టుకు స‌మ‌ర్పించిన అఫిడ‌విట్‌లో తెలిపింది. కేసుకు సంబంధించి ప్ర‌స్తుత ప‌రిస్థితిపై రిపోర్ట్ ఇవ్వాల‌ని కోర‌గా.. సుప్రీంకు సీబీఐ ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. ములాయం, అఖిలేశ్ వ‌ద్ద ఆదాయానికి మించిన ఆస్తులు క‌లిగి ఉన్న‌ట్లు త‌మ‌కు ఆధారాలు దొర‌క‌లేద‌ని సీబీఐ త‌న రిపోర్ట్‌లో వెల్ల‌డించింది.

809
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles