ఆయన సంపాదన రోజుకు రూ.300 కోట్లు!

Wed,September 26, 2018 07:28 AM

Reliances Mukesh Ambani earned Rs 300 crore per day over last one year

న్యూఢిల్లీ: సెకనుకు రూ.35 వేలు.. నిమిషానికి రూ.21 లక్షలు.. గంటకు రూ.12.5 కోట్లు.. రోజుకు రూ.300 కోట్లు.. ఇదీ గడిచిన ఏడాది కాలంలో భారతీయ కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముకేశ్ అంబానీ సంపాదన తీరు. ఈ ఏడాదికి గాను బార్క్‌లేస్ హరున్ ఇండియా ధనవంతుల జాబితా మంగళవారం విడుదలైంది. తొలి స్థానంలో ఉన్న ముకేశ్ మొత్తం సంపద.. తర్వాతి మూడు స్థానాల్లో ఉన్నవారి మొత్తం సంపద కంటే ఎక్కువ కావడం గమనార్హం. రూ.3,71,000 కోట్ల సంపదతో వరుసగా ఏడోసారి ముకేశే అగ్రస్థానంలో నిలిచారు. రూ.1,59,000 కోట్లతో ఎస్‌పీ హిందుజా కుటుంబం రెండో స్థానంలో ఉండగా, రూ.1,14,500 కోట్లతో లక్ష్మీనివాస్ మిట్టల్ కుటుంబం మూడో స్థానంలో, రూ.96,100 కోట్లతో అజీం ప్రేమ్‌జీ నాలుగో స్థానంలో ఉన్నారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ విలువ 45 శాతానికిపైగా పుంజుకోవడం ముకేశ్ అంబానీ సంపదను అమాంతం పెంచేసిందని బార్క్‌లేస్ అభిప్రాయపడింది. టాప్-10లో చివరి ఆరు స్థానాల్లో ఉన్నవారి విషయానికొస్తే.. దిలీప్ సంఘ్వీ (రూ.89,700 కోట్లు), ఉదయ్ కొటక్ (రూ.78,600 కోట్లు), సైరస్ పూనవాలా (రూ.73,000 కోట్లు), గౌతమ్ అదానీ కుటుంబం (రూ.71,200 కోట్లు), సైరస్ పల్లోంజీ మిస్త్రీ (రూ.69,400 కోట్లు), షాపూర్ పల్లోంజీ మిస్త్రీ (రూ.69,400 కోట్లు) ఉన్నారు. ఇక కుటుంబ ఆస్తుల్లో చూస్తే అంబానీల సంపద రూ.3,90,500 కోట్లుగా ఉన్నది. కాగా, రూ.1,000 కోట్లు అంతకంటే ఎక్కువ సంపద ఉన్నవారు 34 శాతం పెరుగగా, 831 మంది కుబేరుల సంపద దేశ జీడీపీలో పావు శాతానికి సమానంగా ఉండటం విశేషం.

9083
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles