రిల‌యెన్స్ ఆఫ‌ర్‌.. ఒక షేర్ ఉంటే మ‌రో షేర్ ఫ్రీ!

Fri,July 21, 2017 01:40 PM

ముంబై: క‌స్ట‌మ‌ర్ల‌కే కాదు రిల‌యెన్స్ షేర్ హోల్డ‌ర్ల‌కు కూడా బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించారు ముకేశ్ అంబానీ. రిల‌యెన్స్ 40వ వార్షిక స‌ర్వ‌స‌భ్య స‌మావేశం సంద‌ర్భంగా షేర్‌హోల్డ‌ర్ల‌కు 1:1 బోనస్ ప్ర‌క‌టించారు. అంటే ప్ర‌స్తుతం ఒక షేర్ ఉన్న అంద‌రికీ మ‌రో షేర్ ఫ్రీగా ఇవ్వ‌నున్నారు. దీంతో రిల‌యెన్స్ షేర్ ధ‌ర అమాంతం పెరిగింది. ఏకంగా 3.19 శాతం లాభ‌ప‌డి రూ.1578కి చేరింది. అంత‌కుముందే స‌మావేశం ప్రారంభ‌మైన స‌మ‌యంలోనే రిల‌యెన్స్ షేర్లు 9 ఏళ్ల గ‌రిష్ఠ స్థాయికి చేరిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. 1977లో తొలిసారి రిల‌యెన్స్ ఐపీఓకి వెళ్లింది. అప్ప‌టి నుంచీ దేశంలో షేర్‌హోల్డ‌ర్ సంస్కృతికి తెర‌లేపింది. ఇప్పుడు 40 ఏళ్ల త‌ర్వాత 1+1 షేర్ బోన‌స్‌తో షేర్‌హోల్డ‌ర్ల‌కు పెద్ద బ‌హుమాన‌మే ఇచ్చారు అంబానీ. 1977లో రూ.వెయ్యి పెట్టి రిల‌యెన్స్ షేర్ కొంటే.. దాని విలువ ఇప్పుడు రూ.16.5 ల‌క్ష‌ల‌కు చేరిన‌ట్లు అంబానీ వెల్ల‌డించారు. సంస్థ మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ రూ.5 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరింద‌ని ఆయ‌న తెలిపారు.

2449
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles