బీజేపీలో చేరిన కపిల్‌ మిశ్రా

Sat,August 17, 2019 03:17 PM

Rebel AAP Leader Kapil Mishra, Disqualified By Delhi Speaker, Joins BJP

న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ మంత్రి, ఆప్ రెబల్ నేత, అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యే కపిల్ మిశ్రా ఇవాళ భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో చేరారు. ఆప్ చీఫ్, అరవింద్ కేజ్రీవాల్ మంత్రివర్గంలో గతంలో ఆయన మంత్రిగా పనిచేశారు. ఆప్ మహిళా విభాగం అధ్యక్షురాలు రిచా పాండే కూడా బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు శ్యామ్ జాజు, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ సమక్షంలో ఆప్ నేతలిద్దరూ కాషాయ కండువా కప్పుకున్నారు.

ఒకప్పుడు కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న కపిల్ మిశ్రాపై ఫిరాయింపుల వ్యతిరేక చట్టం కింద అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ అనర్హత వేటు వేశారు. 2017 మేలో మిశ్రాను కేజ్రీవాల్ మంత్రివర్గం నుంచి తొలగించారు. ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోసం మిశ్రా ప్రచారం చేసినందుకు గానూ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఢిల్లీ స్పీకర్ రామ్ నివాస్ అనర్హత వేటు వేశారు. మిశ్రాను అనర్హుడిగా ప్రకటించాలంటూ ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్పీకర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

852
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles