డోప్ పరీక్షకు రెడీ : పంజాబ్ సీఎం

Fri,July 6, 2018 02:09 PM

Ready to take a dope test, says Punjab CM Amarinder Singh

చండీఘడ్: విమర్శకులకు చెక్ పెట్టారు పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్. డోప్ పరీక్షలకు తాను సిద్దమే అన్నారు. డ్రగ్స్ అమ్మేవాళ్లకు, స్మగ్లర్లకు మరణశిక్షను ఖరారు చేయాలని సీఎం అమరిందర్ సింగ్ ఇటీవల కొన్ని ప్రతిపాదనలు చేసి కేంద్రానికి పంపారు. అంతేకాదు ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా డ్రగ్ టెస్ట్ చేసుకోవాలన్నారు. దీంతో ఉద్యోగులు, ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రజాప్రతినిధులు కూడా ఆ జాబితాలో ఉండాలని కొందరు డిమాండ్ చేశారు. ఆ డిమాండ్‌ను సీఎం అమరిందర్ స్వాగతించారు. తానూ డోప్ పరీక్షకు సిద్దమే అన్నారు. కానీ క్యాబినెట్ మంత్రులకు మాత్రం తాను హామీ ఇవ్వలేనన్నారు.1328
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles