లోక్‌సభలో ట్రిపుల్ తలాక్ బిల్లు

Thu,December 28, 2017 12:56 PM

Ravi Shankar Prasad tabled Triple Talaq bill in Lok Sabha

న్యూఢిల్లీః చారిత్రాత్మకమైన ట్రిపుల్ తలాక్ బిల్లును ఇవాళ లోక్‌సభలో ప్రవేశపెట్టారు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్. మూడుసార్లు తలాక్ చెప్పి భార్యను వదిలించుకునే ఈ దురాచారానికి చెక్ పెట్టేందుకు కేంద్రం ఈ బిల్లు తీసుకొచ్చింది. ఇది చారిత్రకమైన రోజు. మనం చరిత్ర సృష్టించబోతున్నాం. ఇది మహిళల ఆత్మగౌరవానికి సంబంధించిన బిల్లు. సుప్రీంకోర్టు నిషేధం విధించినా.. ఇంకా ట్రిపుల్ తలాక్ చెబుతూనే ఉన్నారు. ఎందుకంటే దీనికి వ్యతిరేకంగా చట్టమేమీ లేదు. ఇది రాజ్యాంగ విరుద్ధమని కోర్టు చెప్పింది. అలాంటప్పుడు ఇది కొనసాగడానికి పార్లమెంట్ ఎలా అంగీకరిస్తుంది అని బిల్లు ప్రవేశపెట్టే సమయంలో రవిశంకర్ ప్రసాద్ అన్నారు.దీనిపై మొదట ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ మాట్లాడారు. ఇది ప్రాథమిక హక్కుల భంగం కలిగించే చట్టమని ఆయన వాదించారు. ఈ బిల్లు పాసైతే.. అది ముస్లిం మహిళలకు అన్యాయం చేసినట్లే అవుతుందని అసద్ స్పష్టంచేశారు. బిజు జనతాదళ్ కూడా ఈ బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడింది. ఆ పార్టీ ఎంపీ భర్తృహరి మాట్లాడుతూ.. ట్రిపుల్ తలాక్ బిల్లు అసంపూర్ణంగా ఉన్నదని, దీనిని అందరి ఆమోదంతో మరోసారి ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.

3051
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles