మూడంతస్తుల భవనాన్ని కూల్చేసిన ఎలుకలు.. వీడియో

Mon,April 16, 2018 05:17 PM

rats bring down 3 storey Agra building

ఆగ్రా : భవనాన్ని ఎలుకలు కూల్చేశాయి.. ఇది వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నప్పటికీ ఈ ఘటన నిజంగానే చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ ఆగ్రాలోని మన్‌కామేశ్వర్ ఆలయానికి సమీపంలో మూడు అంతస్తుల భవనం ఆదివారం ఉదయం కుప్పకూలిపోయింది. ఈ సందర్భంగా ఇంటి యజమాని మాట్లాడుతూ.. ఈ భవనం ఎలుకల వల్లే కూలిపోయిందని తెలిపారు. గత కొంతకాలం నుంచి ఇంటి కింది భాగం నుంచి డ్రైనేజీ కాలువల వరకు ఎలుకలు రంధ్రాలు చేశాయన్నారు. ఇంటి నిండా రంధ్రాలు కావడంతో.. క్రమక్రమంగా పునాది, గోడలు దెబ్బతిన్నాయని చెప్పారు. ఇటీవలే కురిసిన వర్షాలకు ఇల్లు బాగా దెబ్బతిన్నదని పేర్కొన్నారు. వర్షపు నీరు ఎలుకలు చేసిన రంధ్రాల ద్వారా ఇంట్లోకి ప్రవేశించడంతో.. పునాది పూర్తిగా పాడైందన్నారు.

శనివారం సాయంత్రం తన ఇంటిలో గోడలపై ఉన్న పెచ్చు పడిపోవడాన్ని గమనించాము. స్నేహితులు, బంధువుల సూచన మేరకు ఆ రోజు రాత్రి ఇంటిని ఖాళీ చేసి వెళ్లాను. మరుసటి రోజు(ఆదివారం) ఉదయం నిమిషాల్లోనే భవనం కుప్పకూలిపోయింది. ఒకవేళ ఆ భవనంలోనే ఉంటే తనతో పాటు 8 మంది కుటుంబ సభ్యులు సజీవసమాధి అయ్యే వాళ్లమని కన్నీటి పర్యంతమయ్యారు. మన్‌కామేశ్వర్ ఆలయ పరిసరాలతో పాటు కచేరీ ఘాట్, జీవని మండి, ఫిలిప్ గంజ్, షేబ్ కా బజార్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఎలుకల బెడద ఎక్కువైందని అధికారులు తెలిపారు. ఎలుకలు రంధ్రాలు చేయడం వల్ల అటు ఇండ్లు, ఇటు డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుందని అధికారులు పేర్కొన్నారు.

6968
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS