టాటా ట్ర‌స్ట్స్‌కు ర‌త‌న్ టాటా గుడ్‌బై!

Fri,December 16, 2016 12:31 PM

Ratan Tata likely to step down as Tata Trusts chairman

ముంబై: టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటా ట్ర‌స్ట్స్ చైర్మ‌న్ ప‌ద‌వి నుంచి ర‌త‌న్ టాటా త‌ప్పుకోనున్నారు. కొత్త చైర్మ‌న్ ఎంపిక ప్ర‌క్రియ‌పై స‌ల‌హా ఇవ్వాల్సిందిగా ఓ క‌న్స‌ల్టెంట్‌ను టాటా ట్ర‌స్ట్స్ కోరింది. ఈ ప్ర‌క్రియ వ‌చ్చే ఏడాది తొలి అర్ధ‌భాగంలో పూర్తి కానుంది. టాటా ట్ర‌స్ట్స్ కొత్త చైర్మ‌న్ క‌చ్చితంగా ఓ భారతీయుడే కానీ పార్సీ లేదా టాటా కుటుంబం నుంచే ఉండాల‌న్న నిబంధ‌న మాత్రం లేదని సంస్థలో ట్ర‌స్టీ అయిన ఆర్కే క్రిష్ణ కుమార్ వెల్ల‌డించారు. మొత్తం 108 బిలియ‌న్ డాల‌ర్ల విలువైన టాటా గ్రూప్‌లో టాటా ట్ర‌స్ట్స్ వాటానే 41 బిలియ‌న్ డాల‌ర్లు. కొత్త చైర్మ‌న్‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించిన త‌ర్వాత టాటా ట్ర‌స్టీగా కూడా కొన‌సాగే అవ‌కాశం క‌నిపించడం లేదు. అదే జ‌రిగితే భార‌త్‌లో అతిపెద్ద సంస్థతో ర‌త‌న్‌టాటాకు ఉన్న ద‌శాబ్దాల బంధానికి తెర‌ప‌డిన‌ట్ల‌వుతుంది.

టాటా స‌న్స్ చైర్మ‌న్ ప‌ద‌వి నుంచి సైర‌స్ మిస్త్రీని తొల‌గించిన త‌ర్వాత దానికి కూడా ర‌త‌న్ టాటా తాత్కాలిక చైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఫిబ్ర‌వ‌రి చివ‌రిలోపు టాటా స‌న్స్ చైర్మ‌న్ ఎంపిక ప్ర‌క్రియ‌ను ముగించాలని భావిస్తున్న నేప‌థ్యంలో.. టాటా ట్ర‌స్ట్స్ చైర్మ‌న్ ప‌ద‌వి నుంచి కూడా ర‌త‌న్ టాటా త‌ప్పుకుంటార‌న్న వార్త రావ‌డం గ‌మ‌నార్హం. ర‌త‌న్ టాటా చైర్మ‌న్ ప‌ద‌వి నుంచి తప్పుకుంటే తాను కూడా ఇక ట్ర‌స్టీగా ఉండ‌బోన‌ని మేనేజింగ్ ట్ర‌స్టీ ఆర్ వెంక‌ట‌రామ‌నన్ అన్నారు. టాటా ట్ర‌స్ట్స్ కొత్త చైర్మ‌న్ బ‌య‌టి వ్య‌క్తి కూడా కావ‌చ్చ‌ని, ఎవ‌రైనా స‌మ‌ర్థ‌మైన వ్య‌క్తి ఉంటే ట్ర‌స్టీలు ప్ర‌తిపాదించ వ‌చ్చ‌ని క్రిష్ణ కుమార్ తెలిపారు. స‌మీప భ‌విష్య‌త్తులో కూడా టాటా ట్ర‌స్ట్స్‌కు, టాటా స‌న్స్‌కు వేర్వేరు చైర్మ‌న్లే ఉంటార‌ని ఆయ‌న స్ప‌ష్టంచేశారు. టాటాల చ‌రిత్ర‌లో టాటా ట్ర‌స్ట్స్‌కు తొలిసారి పార్శీ కాని చైర్మ‌న్ కూడా వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు క్రిష్ణ కుమార్ చెప్పారు.

1453
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles