అరుణాచల్ ప్రదేశ్‌లో అరుదైన తాబేలు..

Sun,August 25, 2019 05:57 PM

Rare impressed Tortoise Species Seen In Arunachal Pradesh

ఇటానగర్: అరుణాచల్‌ప్రదేశ్‌లో అరుదైన జాతికి చెందిన తాబేలును స్థానిడొకరు గుర్తించారు. అరుదైన జాతికి చెందిన మనౌరియా ఇంప్రెస్సా (శాస్త్రీయనామం) తాబేలును బందెర్‌దేవా ఫారెస్ట్ డివిజన్ పరిధిలో కకోయ్ ప్రాంతంలో వార్ నకొంగ్ అనే వ్యక్తి గుర్తించి..జూ అధికారులకు సమాచారమందించాడు. అరుణాచల్‌ప్రదేశ్‌లో ఇలాంటి తాబేలును గుర్తించడం..ఈ ఏడాది ఇది రెండోసారి.

ఇటీవల కొంతమంది గ్రామస్థులు ఆహారం కోసం ఓ తాబేలును చంపారు. ఆ తర్వాత మరోసారి ఎప్పుడైనా తాబేలును చూస్తే దాన్ని చంపకుండా నాకు చెప్పాలని మా నాన్నకు చెప్పాను. అరుదైన తాబేలు (మనౌరియా ఇంప్రెస్సా)ను నాన్న నా దగ్గరకు తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇటానగర్ జూ అధికారులకు అప్పగించానని వారు నకొంగ్ తెలిపాడు. తొలిసారి ఈ తాబేలును హపోలి ఫారెస్ట్ డివిజన్ అధికారి బంటీ టావు గుర్తించారు. ప్రస్తుతం ఇటానగర్ జూలో మనౌరియా ఇంప్రెస్సా జాతికి చెందిన రెండు మగ, ఒక ఆడ తాబేలు ఉన్నాయి.

3373
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles