25 ఏండ్ల తర్వాత రేప్ కేసు నిందితుడు అరెస్ట్

Tue,November 13, 2018 08:50 PM

Rape accused arrested after 25 years Absconding

జమ్మూకశ్మీర్: అత్యాచారం కేసులో పరారీలో ఉన్న నిందితుడిని జమ్మూకశ్మీర్ పోలీసులు 25 ఏండ్ల తర్వాత అరెస్ట్ చేశారు. 1993 సంవత్సరంలో బనుల్లా గ్రామానికి చెందిన ఖుషల్ హుస్సేన్ అనే వ్యక్తి ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడి..అక్కడి నుంచి పరారయ్యాడు. ఖుషల్ హుస్సేన్ అప్పటి నుంచి పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుని తిరుగుతున్నాడు. ఫూంచ్ జిల్లాలోని మెంధార్ ప్రాంతంలో ప్రత్యేక పోలీసుల బృందం ఖుషల్ హుస్సేన్‌ను గుర్తించి అదుపులోకి తీసుకుంది. ఆర్‌పీసీ (రన్‌బిర్ పీనల్ కోడ్)లోని వివిధ సెక్షన్ల కింద హుస్సేన్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

4315
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles