రాన్‌బాక్సి మాజీ ప్రమోటర్ అరెస్ట్

Thu,October 10, 2019 06:14 PM

ఢిల్లీ: ఫార్మా దిగ్గజం రాన్‌బాక్సి మాజీ ప్రమోటర్ శివేందర్ సింగ్ అరెస్ట్ అయ్యాడు. రూ.740 కోట్ల నిధుల దుర్వినియోగం, మోసం కేసులో శివేందర్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. శివిందర్‌తో పాటు ఆయన సోదరుడు మల్విందర్ సింగ్ సైతం ఈ కేసులో ఉన్నాడు. ఆగస్టు నెలలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇరువురి ఇండ్లు, కార్యాలయాల్లో సోదాలు చేసిన విషయం తెలసిందే. రిలిగేర్ ఫిన్వెస్ట్ లిమిటెడ్ ఫిర్యాదు మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. మనీ లాండరింగ్ కేసులో ఈడీ అధికారులు ఈ ఇద్దరు సోదరులను విచారణ చేస్తున్నారు.

687
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles