రాముడికి కట్టాల్సింది గుడి.. భారీ విగ్రహం కాదు

Wed,November 28, 2018 03:41 PM

యూపీలో ఓ వైపు అయోధ్య ఆలయ నిర్మాణం వివాదం కొలిక్కిరాకుండానే సీఎం యోగి ఆదిత్యనాథ్ రామునికి 221 మీటర్ల ఎత్తైన విగ్రహం కడతామని ప్రకటించారు. దీనిపై వారణాసిలో జరుగుతున్న సంతులసభ వ్యతిరేకత తెలిపింది. మూడు రోజుల పాటు ఈ సభలు జరుగుతున్నాయి. గతవారం అయోధ్యలో జరిగిన వీహెచ్‌పీ సభ రాజకీయ ఉద్దేశాలతో జరిగిందని సభల్లో ప్రసంగించిన వక్తలు దుయ్యబట్టారు. బుధవారం ద్వారకా శారదాజ్యోతిష పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి ఈ సభల్లో మాట్లాడుతూ రాముడిపై రాజకీయం చేయొద్దని అన్నారు. ప్రభుత్వం కేవలం విగ్రహాలు కడుతున్నదని, గుడి గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు. గుజరాత్‌లో కట్టిన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ భారీ విగ్రహం గురించి ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. అలాగే ఆదిత్యనాథ్ ప్రభుత్వం తలపెట్టిన విగ్రహ నిర్మాణం అర్థరహితమైన చర్య అనీ, ప్రజల విశ్వాసానికి అది విరుద్ధమనీ నొక్కిచెప్పారు. అయోధ్యలో రామాలయం నిర్మించాలని స్పష్టం చేశారు. రామజన్మభూమి స్థలంలో మసీదు ఉండేదనవడం సరికాదని, 1992లో కరసేవకులు కూల్చింది మసీదు కాదని, అది ఆలయమేనని అన్నారు. వివాదాస్పద స్థలంలో మసీదు ఉండేదనడం కేవలం ప్రచారం మాత్రమేనని పేర్కొన్నారు. మసీదు ఉండేదని ముస్లింలు కోర్టులో రుజువు చేయలేకపోయారని చెప్పారు. అసలు ఏ రాజకీయపార్టీ రామాలయం నిర్మించదని, కేవలం రాజకీయం మాత్రమే చేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

1919
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles