రామ్‌నాథ్ అసాధార‌ణ రాష్ట్ర‌ప‌తి అవుతారు : ప‌్ర‌ధానిMon,June 19, 2017 03:29 PM
రామ్‌నాథ్ అసాధార‌ణ రాష్ట్ర‌ప‌తి అవుతారు : ప‌్ర‌ధాని

న్యూఢిల్లీ: బీహార్ గ‌వ‌ర్న‌ర్ రామ్‌నాథ్ కోవింద్ అసాధార‌ణ రాష్ట్ర‌ప‌తిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తార‌ని ప్ర‌ధాని మోదీ ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఎన్డీఏ కూట‌మి ఇవాళ రామ్‌నాథ్ కోవింద్‌ను రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ఎంపిక చేసింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని మోదీ ట్విట్ట‌ర్‌లో స్పందించారు. రామ్‌నాథ్ అత్యుత్త‌మ రాష్ట్ర‌ప‌తి అవుతార‌ని, పేద‌-బ‌ల‌హీన వ‌ర్గాల త‌ర‌పు ఆయ‌న గ‌ట్టిగా పోరాడుతార‌న్న అభిప్రాయాన్ని ప్ర‌ధాని వెలిబుచ్చారు. రామ్‌నాథ్ కోవింద్ రైతు బిడ్డ అని, ఒక గౌర‌వ‌ప్ర‌ద‌మైన కుటుంబం నుంచి వ‌చ్చార‌ని, ప్ర‌జా సేవ కోసం జీవితాన్ని వెచ్చించార‌ని, పేద‌-బ‌ల‌హీన వ‌ర్గాల కోసం జీవితం ధార‌పోశార‌న్నారు. న్యాయ‌ప‌ర‌మైన అంశాల్లో ఆయ‌నకు విప‌రీత‌మైన ప‌ట్టు ఉంద‌ని, రాజ్యాంగం ప‌ట్ల రామ్‌నాథ్‌కు ఉన్న అనుభవం దేశానికి ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఆశిస్తున్న‌ట్లు ప్ర‌ధాని తెలిపారు. జూలై 24న రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ప‌ద‌వీకాలం ముగుస్తుంది. ఈనేప‌థ్యంలో కొత్త రాష్ట్ర‌ప‌తి కోసం ఎన్నిక జ‌ర‌గ‌నున్న‌ది. దానిలో భాగంగానే ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా రామ్‌నాథ్‌ను ఎంపిక చేశారు. రామ్‌నాథ్‌ను త‌మ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ఎంపిక చేసిన విష‌యాన్ని ప్ర‌ధాని మోదీ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా కూడా తెలియ‌జేశారు.1343
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS