వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే రామ మందిర బిల్లు!

Fri,November 23, 2018 06:42 PM

న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు బీజేపీ ఎంపీ రవీంద్ర కుశ్వారా వెల్లడించారు. ఒకవేళ ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందకపోతే కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికీ అయోధ్య కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మందిర నిర్మాణం కోసం చట్టం తీసుకురావాలని హిందుత్వ గ్రూపులు చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నాయి. అయితే డిసెంబర్ 11 నుంచి ప్రారంభం కాబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లు పెట్టి తీరతామని ఎంపీ కుశ్వార చెప్పడం గమనార్హం. పార్లమెంట్‌లో ఈ బిల్లుపై చర్చ జరుగుతుందని, అప్పుడే ఏ పార్టీ మందిరాన్ని కోరుకుంటున్నదో, ఏది వ్యతిరేకిస్తున్నదో తెలుస్తుందని ఆయన అన్నారు. లోక్‌సభలో కచ్చితంగా బిల్లు పాసవుతుందని, రాజ్యసభలో బీజేపీకి సరిపడా బలం లేకపోవడం వల్ల అక్కడ పాసవుతుందో లేదోనని అనుమానం వ్యక్తం చేశారు.

1876
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles