కేఏ పాల్ పంచ్‌లు చూశారా? వర్మ సెటైర్ అదిరింది..!

Sat,March 23, 2019 04:05 PM

ram gopal varma satire on ka paul video

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలుసు కదా. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. యూట్యూబ్‌లో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ప్రస్తుతం ఆయన వీడియోలే దర్శనమిస్తున్నాయి. తాజాగా కేఏపాల్‌కు చెందిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన కారులో కూర్చొని బాక్సింగ్ చేస్తున్నట్టు యాక్షన్ చేయడం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. అయితే.. ఆ వీడియో రామ్‌గోపాల్‌వర్మ చేతికి చిక్కింది. ఆయన చేతికి చిక్కితే ఊరుకుంటారా? ఆ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసి.. ఏమన్నాడో తెలుసా?

ప్రపంచ దిగ్గజ బాక్సర్ చాంపియన్ మైక్ టైసన్‌ను మట్టికరిపించిన ఈవాండర్ హోలీఫీల్డ్‌కు కేఏ పాలే బాక్సింగ్‌లో ట్రెయినింగ్ ఇచ్చాడని నేను ఇప్పుడు ఒప్పుకుంటున్నా.. అంటూ సెటైర్ వేశాడు. ఇక ఓవైపు వర్మ ట్వీట్.. మరోవైపు కేఏపాల్ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి.


5155
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles