కేంద్రమంత్రి ఫిట్‌నెస్ ఛాలెంజ్..వీడియో

Tue,May 22, 2018 07:19 PM

Rajyavardhan rathore Fitness Challenge vedio For Indians

న్యూఢిల్లీ: కేంద్ర క్రీడా శాఖ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ ఫిట్‌నెస్ గురుగా మారారు. ప్రతీ ఒక్కరు ఫిట్‌నెస్ మంత్రను ఫాలో అవ్వాలని ఓ వీడియో ద్వారా సందేశాన్ని అందించారు. రాజ్యవర్ధన్ రాథోడ్ తన కార్యాయలంలోనే 10 డిప్స్ కొడుతూ షూట్ చేసిన వీడియోను సోషల్‌మీడియా ద్వారా షేర్ చేస్తూ..అందరూ ఫిట్‌నెస్ ఛాలెంజ్‌ను స్వీకరించాలని కోరారు.

ఫీట్స్ వేసి తన ఫిట్‌నెస్ ఛాలెంజ్‌లో జాయిన్ కావాలని టీమిండియా కెప్టెన్ విరాట్‌కోహ్లీ, యాక్టర్ హృతిక్‌రోషన్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనానెహ్వాల్‌ కు ఛాలెంజ్‌ చేయడం విశేషం. హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్ క్యాంపెయిన్‌లో భాగంగా వీడియో రూపొందించారు రాజ్యవర్ధన్ సింగ్‌రాథోడ్. ప్రతీ ఒక్కరూ ఇలా ఫిట్‌నెస్ మంత్రలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
1807
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS