రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

Fri,February 23, 2018 08:14 PM

rajya sabha elections notification released

న్యూఢిల్లీ: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 16 రాష్ర్టాల్లోని 58 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో 3 స్థానాలు, ఎపీ 3, బీహార్ 6, ఛత్తీస్‌గఢ్ 1, ఉత్తరాఖండ్ 1, పశ్చిమబెంగాల్ 5, ఒడిశా 3, జార్ఖండ్ 2, గుజరాత్ 4, హర్యానా 1, హిమాచల్ ప్రదేశ్ 1, కర్ణాటక 4, మధ్య ప్రదేశ్ 5, మహారాష్ట్ర 6, ఉత్తరప్రదేశ్ 10 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

రాజ్యసభ ఎన్నికలకు మార్చి 5న నోటిఫికేషన్ వెలువడనుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేది మార్చి 12. నామినేషన్ల పరిశీలనకు చివరి తేదీ మార్చి 13. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ మార్చి 15. మార్చి 23న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 23 సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుంది.

2607
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS