రాఫెల్ డీల్.. రాజ్యసభ వాయిదా

Fri,August 10, 2018 12:58 PM

Rajya Sabha adjourned after uproar by Opposition over Rafale deal issue

న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశంపై ఇవాళ రాజ్యసభ స్తంభించింది. రాఫెల్ డీల్‌పై చర్చించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ అంశంపై ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. దీంతో సభను మధ్యాహ్నం 2.30 నిమిషాలకు వాయిదా వేశారు. రాఫెల్ ఒప్పందం మోదీ ప్రభుత్వంలో చోటుచేసుకున్న అతిపెద్ద అవినీతిగా కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. గురువారం ఇదే అంశంపై చ‌ర్చ చేప‌ట్టాల‌ని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ సభలో డిమాండ్ చేశారు. కానీ ఆ డిమాండ్‌ను తోసిపుచ్చారు. దీంతో ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ .. రాఫెల్ అంశాన్ని మళ్లీ ప్రస్తావించింది. లోక్‌సభలోనూ గురువారం రాఫెల్ అంశాన్ని మల్లిఖార్జున్ ఖర్గే లేవనెత్తారు. జీరో అవర్‌లో ఈ ప్రస్తావన లేవనెత్తిన ఆయన.. ఇది అతిపెద్ద స్కామ్ అని ఆరోపించారు. రాఫెల్ డీల్‌పై సంయుక్త పార్లమెంటరీ కమిటీ చేత విచారణ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో జ‌రిగిన ఆందోళ‌న కార్య‌క్ర‌మంలో.. కాంగ్రెస్ పార్టీ నేత సోనియా గాంధీ కూడా ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు.

732
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles