పాక్‌లో మ‌ళ్లీ స‌ర్జిక‌ల్ దాడులు జ‌ర‌గొచ్చు!

Fri,February 3, 2017 03:05 PM

Rajnath Singh said India cannot rule out more surgical strikes in Pakistan-controlled territory

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌పై మ‌రోసారి స‌ర్జిక‌ల్ దాడులు జ‌రిగినా జ‌ర‌గొచ్చ‌ని అన్నారు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌. గ‌తేడాది సెప్టెంబ‌ర్‌లో పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌లోని ఉగ్ర‌వాద స్థావ‌రాల‌పై భార‌త సైన్యం స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ జ‌రిపిన విష‌యం తెలిసిందే. అది జరిగిన నాలుగు నెల‌ల త‌ర్వాత మ‌రోసారి దాయాదికి త‌మ క‌ఠిన వైఖ‌రిని విస్ప‌ష్టంగా చెప్పే ప్ర‌య‌త్నం చేశారు రాజ్‌నాథ్‌. పాక్ మ‌న పొరుగుదేశం. వాళ్లు మంచిగా ఉంటే అలాంటి దాడుల అవ‌స‌రం రాదు. కానీ ఉగ్ర‌వాద సంస్థ‌లు లేదా ఇత‌రులు భార‌త్‌పై దాడికి దిగితే మాత్రం మ‌ళ్లీ స‌ర్జిక‌ల్ దాడులు జ‌ర‌గ‌వ‌న్న హామీ ఇవ్వ‌లేను అని ఆయ‌న స్ప‌ష్టంచేశారు. ఓ నేష‌న‌ల్ టీవీ చానెల్‌కు ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు.

ల‌ష్క‌రే తోయిబా చీఫ్ హ‌ఫీజ్ సయీద్‌ను పాక్ హౌజ్ అరెస్ట్ చేయ‌డంపై స్పందిస్తూ.. అది కేవ‌లం కంటితుడుపు చ‌ర్య అని రాజ్‌నాథ్ అన్నారు. నిజంగా ఉగ్ర‌వాద చ‌ర్య‌ల‌కు అడ్డుక‌ట్ట వేయాల‌ని పాక్ అనుకుంటే.. చ‌ట్ట‌ప‌రంగా అత‌నిపై చ‌ర్య‌లు తీసుకొని జైల్లో వేయాల‌ని స్ప‌ష్టంచేశారు. పాక్‌లో దాగున్న దావూద్‌ను ప‌ట్టుకోవ‌డానికి స‌రైన స‌మ‌యం కోసం వేచి చూస్తున్నామ‌ని వెల్ల‌డించారు. పాక్‌పై విర‌చుకుప‌డిన రాజ్‌నాథ్‌.. చైనా విష‌యంలో మాత్రం ఆచితూచి స్పందించారు. జైషే చీఫ్ మసూద్ అజ‌ర్‌ను అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాదిగా ప్ర‌క‌టించ‌డాన్ని చైనా ప‌దేప‌దే అడ్డుకోవ‌డంపై ఆయ‌న స్పందించారు. అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో తీసుకున్న నిర్ణ‌యం కార‌ణంగా చైనా అలా వ్య‌వ‌హ‌రిస్తుండవ‌చ్చు. కానీ భ‌విష్య‌త్తులో దీనికి మ‌ద్దతు తెలుపుతార‌న్న న‌మ్మ‌కం ఉంది అన్నారు.

ఇక అమెరికా ఏడు ముస్లిం దేశాల‌పై నిషేధం విధించడాన్ని కూడా రాజ్‌నాథ్ త‌ప్పుబ‌ట్ట‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అయితే స్థానికంగా ఉగ్ర‌వాద ప‌రిస్థితుల‌ను అంచ‌నా వేసిన త‌ర్వాత ట్రంప్ ఆ నిర్ణ‌యం తీసుకొని ఉంటే బాగుండేద‌ని అన్నారు. ఇక యూపీ ఎన్నిక‌ల్లో బీజేపీ 250కిపైగా సీట్లు గెలుస్తుంద‌ని రాజ్‌నాథ్ ఆశాభావం వ్య‌క్తంచేశారు.

2722
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles