పెళ్లి కొడుకు లేకుండానే ఊరేగుతున్న కాంగ్రెస్ పార్టీ..

Wed,November 21, 2018 03:11 PM

Rajnath Singh equates Congress with a procession of marriage without groom

భోపాల్: కాంగ్రెస్ పార్టీపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. పెళ్లి కొడుకు లేకుండానే ఊరేగింపు చేస్తున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఉందని రాజ్‌నాథ్ విమర్శించారు. తమ పార్టీ ఎన్నికల కోసం సీఎం అభ్యర్థిని ప్రకటించిందని, కానీ కాంగ్రెస్ మాత్రం తమ అభ్యర్థిని ఇంకా వెల్లడించలేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి నాయకుడు లేరని, ఆ పార్టీ వ్యవస్థ కూడా బలోపేతంగా లేదన్నారు. ప్రధాని అభ్యర్థిని కూడా తాము ప్రకటించామని, కానీ బీజేపీ స్థాయిలో కాంగ్రెస్ వ్యవహరించడం లేదని రాజ్‌నాథ్ ఆరోపించారు. మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్, రాజస్థాన్ రాష్ర్టాల్లో ఎవరి పొత్తు లేకుండానే బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని మంత్రి తెలిపారు.

2535
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles