అమ‌ర‌వీరుడిని భుజాల‌పై మోసిన కేంద్ర‌ హోంమంత్రి

Fri,February 15, 2019 03:32 PM

బుద్గాం: పుల్వామా దాడిలో మృతిచెందిన సీఆర్‌పీఎఫ్ జ‌వాన్ల‌కు ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాళి అర్పించారు. పార్థివ‌దేహాల‌కు పుష్ప‌నివాళి అర్పించిన త‌ర్వాత రాజ్‌నాథ్‌.. అమ‌ర‌వీరుడి శ‌వ‌పేటిక‌ను మోసారు. జ‌మ్మూక‌శ్మీర్ డీజీపీ దిల్‌బాగ్ సింగ్‌తో పాటు రాజ్‌నాథ్ .. ఓ జ‌వాన శ‌వ‌పేటికను త‌మ భుజాల‌పై మోసుకెళ్లారు. పుల్వామా దాడిలో మొత్తం 49 మంది జ‌వాన్లు మృతిచెందారు. దాడికి ప్ర‌తీకారం తీర్చుకుంటామ‌ని కూడా ప్ర‌ధాని అన్నారు. ఇవాళ మ‌ధ్యాహ్నం ప్ర‌త్యేక విమానంలో హోంమంత్రి రాజ్‌నాథ్‌.. బుద్గామ్ చేరుకున్నారు. ఆ త‌ర్వాత మృతుల‌కు నివాళి అర్పించారు.3626
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles