రాజీవ్ రహదారిని నేషనల్ హైవేగా గుర్తించాలి!

Tue,February 12, 2019 05:20 PM

న్యూఢిల్లీ: రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా గుర్తించాలని లోక్‌సభ జీరో అవర్‌లో టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ కుమార్ ప్రస్తావించారు. కరీంనగర్ మీదుగా హైదరాబాద్ నుంచి రామగుండం వరకు ఉన్న రాజీవ్ రహదారిపై తరచూ భారీగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు రాజీవ్ రహదారిని నేషనల్ హైవేగా గుర్తించాల్సిన అవసరముందని ఎంపీ వినోద్ డిమాండ్ చేశారు.

1390
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles