కరుణానిధిని పరామర్శించిన రజనీకాంత్

Tue,July 31, 2018 10:10 PM

Rajinikanth says he is praying to God for Karunanidhi

చెన్నై: అనారోగ్యంతో చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎం. కరుణానిధిని ప్రముఖ సినీనటుడు రజనీకాంత్ మంగళవారం రాత్రి పరామర్శించారు. అనంతరం ఆస్పత్రి బయట రజనీకాంత్ మాట్లాడుతూ.. కరుణానిధి ఆరోగ్య పరిస్థితిని, వైద్యులు అందిస్తున్న చికిత్స వివరాలను ఆయన కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నాను. ప్ర‌స్తుతం ఆయన నిద్రపోతున్నారు. కరుణానిధి దేశంలోనే సీనియర్ నాయకుడు. కరుణానిధి తొందరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. అని పేర్కొన్నారు. అనంత‌రం డీఎంకే నేత అలిగిరితో ర‌జ‌నీ స‌మావేశ‌మ‌య్యారు.885
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS