ఆస్తి వివాదాలు.. చెట్టుకు కట్టేసి కొట్టారు

Tue,July 10, 2018 12:33 PM

Rajasthan Woman Tied To Tree and Beaten By Relatives Over Property Dispute

జైపూర్ : రాజస్థాన్‌లోని ఓ గ్రామంలో దారుణం జరిగింది. ఆస్తి వివాదాలతో ఓ మహిళను చెట్టుకు కట్టేసి చితకబాదిన ఘటన వారం రోజుల క్రితం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. సుమన్(34) అనే మహిళకు, తన సోదరితో పాటు ఇతర బంధువులకు మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయి. దీంతో మొత్తం ఏడుగురు కలిసి.. సుమన్ అనే మహిళను చెట్టుకు కట్టేసి కొట్టారు. ఈ సంఘటన అంతా అక్కడున్న ఓ వ్యక్తి వీడియో తీసి వైరల్ చేశాడు. దీంతో ఈ విషయం పోలీసుల దాకా చేరింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుల్లో నలుగురు పిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ గొడవ జరిగిన సమయంలో సుమన్ భర్త లేడని పోలీసులు పేర్కొన్నారు.

1985
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles