దీపికా పదుకొనె డైలాగ్‌తో రాజస్థాన్ పోలీసుల వినూత్న ప్రచారం..

Thu,November 15, 2018 05:20 PM

Rajasthan Police Is Urging Citizens To Vote Using This Deepika Padukone Dialogue

ఇది ఎన్నికల సీజన్. ఒక్క తెలంగాణలోనే కాదు.. మరో నాలుగు రాష్ర్టాల్లోనూ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ప్రజలంతా ఓటు హక్కు విలువ తెలుసుకోవాలని.. ఖచ్చితంగా ఓటింగ్‌లో పాల్గొనాలని రాజస్థాన్ పోలీసులు వినూత్న ప్రయోగం చేశారు. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె డెబ్యూ మూవీ ఓం శాంతి ఓం సినిమాలోని ఓ డైలాగ్‌ను వాడుకొని ఓటరును చైతన్యం చేస్తున్నారు. రాజస్థాన్‌లో కూడా వచ్చే నెల 7న ఎన్నికలు ఉన్నాయి. దీంతో రాజస్థాన్ పోలీసులు ఇలా వినూత్నంగా ప్రచారం ప్రారంభించారు.

దీపిక చెప్పిన ఏక్ చుట్కీ సిందూర్.. డైలాగ్‌ను ఓటర్లకు అన్వయించారు. ఆ డైలాగ్‌లో ఉన్నట్టుగా రమేశ్ బాబుకు సిందూరం విలువ తెలుసో తెలియదో కానీ.. రాజస్థాన ఓటర్లకు మాత్రం ఓటు వాల్యూ ఖచ్చితంగా తెలుసు అంటూ ట్వీట్ చేశారు. డెమోక్రసీ కి షాన్ హోతా హై ఏక్ ఓట్, ఓటర్స్ కా అధికార్ హోతా హై ఏక్ ఓట్.. అంటూ క్యాప్సన్ పెట్టారు. అంటే.. డెమోక్రసీ అంటే ఓటింగే అని.. ప్రతి ఓటర్‌కు ఓటు వేసే హక్కు ఉంది అని అర్థం. ఇక.. ఈ వినూత్నమైన ప్రచారాన్ని నచ్చిన నెటిజన్లు చొరవ తీసుకొని ఓటు విలువ తెలుపుతున్న రాజస్థాన్ పోలీసులకు సలామ్ కొడుతున్నారు. అయితే.. రాజస్థాన్ పోలీసులు ఇలా సినిమా డైలాగ్స్‌తో ప్రజల్లో అవేర్‌నెస్ తీసుకురావడం ఇదే కొత్తేమీ కాదు. కొన్ని రోజుల క్రితం సైబర్ సెక్యూరిటీ మీద అవగాహన కోసం థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమాను వాడుకున్నారు. రాజస్థానే కాదు ముంబై, ఒడిశా పోలీసులు కూడా ప్రజల్లో అవేర్‌నెస్ తీసుకురావడానికి సినిమాలను, సినిమాల్లోని డైలాగులను వాడుకుంటున్నారు.


1801
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles