కైలాశ్ చౌద‌రీకి పిలుపు

Thu,May 30, 2019 01:54 PM

Rajasthan MP Kailash Choudhary gets call from PMO

హైద‌రాబాద్‌: రాజ‌స్థాన్‌కు చెందిన కైలాశ్ చౌద‌రీ.. ప్ర‌ధాని మోదీ టీమ్‌లో మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకోనున్నారు. బీజేపీ అధ్య‌క్షుడు అమిత్ షా నుంచి ఇవాళ కైలాశ్‌కు ఫోన్ కాల్ వ‌చ్చింది. బార్మ‌ర్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన కైలాశ్ వ‌య‌సు 40 ఏళ్లు. అయితే బీజేపీ మాజీ నేత జ‌శ్వంత్ సింగ్ కుమారుడు మ‌న్వింద‌ర్ సింగ్‌పై కైలాశ్ గెలుపొందారు. ఏడాది క్రిత‌మే బీజేపీని వ‌దిలి.. మ‌న్వింద‌ర్ కాంగ్రెస్‌లో చేరాడు. ఆత్మాభిమానం కోసం పోరాటం చేస్తున్నాన‌ని మ‌న్వింద‌ర్ ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేశారు. అయితే మ‌న్వింద‌ర్‌పై సుమారు మూడు ల‌క్ష‌ల మెజారిటీతో కైలాశ్ విజ‌యం సాధించారు. రాజ‌స్థాన్‌లో అతిపెద్ద నియోజ‌క‌వ‌ర్గం బార్మ‌ర్ కావ‌డంతో ఆ ఎన్నిక ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. వాస్త‌వానికి గ‌త డిసెంబ‌ర్‌లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కైలాశ్ చౌద‌రీ ఓట‌మి పాల‌య్యారు. సిట్టింగ్ ఎంపీ సోనా రామ్‌ను ప‌క్క‌న పెట్టి.. కైలాశ్‌కు చోటు క‌ల్పించారు.

1878
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles