
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి పెద్ద షాక్! రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా ఉన్న ఆకుల సత్యనారాయణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి కూడా సత్యనారాయణ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ , జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు పంపారు. సోమవారం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరనున్నట్లు తెలిసింది.