బస్సులో వేధింపులా.. ఈ అలారం నొక్కండి చాలు..!

Fri,October 26, 2018 05:17 PM

Raise Durga alarm If You Face Harassment On BMTC Buses

అర్ధరాత్రి మహిళ ఒంటరిగా రోడ్డు మీద నడిచినప్పుడే ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చినట్టు.. అని ఓ మహానుభావుడు చెప్పాడు. జనరేషన్లు మారుతున్నాయి కానీ.. ఇప్పటికీ మహిళ అర్ధరాత్రి ఒంటరిగా రోడ్డు మీద నడిచే పరిస్థితి అయితే లేదు. ఎక్కడ పడితే అక్కడ ఆడవాళ్లపై అఘాయిత్యాలు ఎక్కువై పోతున్నాయి. ప్రయాణంలో, నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు, ఇంట్లో, బయట, ఆఫీసుల్లో, ఇలా.. ఎక్కడా ఆడవాళ్లకు రక్షణ లేదు. బయటికెళ్తే వందల మంది మగాళ్ల కళ్లు ఆడవాళ్ల మీదే. బయటికెళ్లి ఇంటికి వచ్చేదాక ఆడవాళ్లకు రక్షణ అనేది కష్టమే. ఇటువంటి తరుణంలో మహిళల రక్షణ కోసం ఏదో ఒకటి చేయాలి.. అని అనుకున్నది బెంగళూరుకు చెందిన ప్రియా వరదరాజన్.

అందుకే.. బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌కు సంబంధించిన బస్సులన్నింటిలో దుర్గా అలారంలను అమర్చింది. బస్సులో ఆకతాయిలు యువతులను, మహిళలను వేధించినా.. ఏడిపించినా.. జస్ట్ అలారం నొక్కితే చాలు.. వెంటనే ఆ ఆకతాయిలపై చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేసింది. ప్రతి బస్సులో ఈ అలారాలు ఉంటాయి. ప్రతి సీటుకు కిటికీ పక్కన స్విచ్చులు ఉంటాయి. పిల్లలకు కూడా అందేలా ఆ స్విచ్చులను ఏర్పాటు చేశారు. బెంగళూరులోని రామయ్య కాలేజీకి చెందిన విద్యార్థులు ఆ అలారంను డిజైన్ చేయగా.. బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ.. ఈ అలారాలను తయారు చేసింది. ఒక్కో అలారానికి కనీసం రూ.7000 ఖర్చు అయింది.

ఒక్కసారి అలారం మోగగానే బస్సు డ్రైవర్ బస్సును వెంటనే రోడ్డు పక్కన నిలిపేస్తాడు. వెంటనే డిపో మేనేజర్, ట్రాఫిక్ కమాండ్‌కు అలర్ట్ వెళ్తుంది. అలారం ఎక్కడ మోగిందో అక్కడికి కండక్టర్ వెళ్లి బాధితులతో మాట్లాడుతాడు. తనను వేధించిన వారిని పట్టుకొని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్‌లో అప్పగిస్తారు. ఒకవేళ కండక్టర్ అక్కడి సమస్యను పరిష్కరించలేకపోతే.. వెంటనే డిపో మేనేజర్‌కు సమాచారం అందిస్తాడు. డిపో మేనేజర్ వెంటనే పోలీసులకు సమాచారం అందిస్తాడు. అలా.. పోలీసులు బస్సు వద్దకు చేరుకొని ఆకతాయిలను అదుపులోకి తీసుకుంటారు. ఈ అలారం వ్యవస్థను గత ఫిబ్రవరిలో ప్రారంభించగా.. ఇప్పటికి 10 సార్లు బాధిత మహిళలు అలారాన్ని ఉపయోగించుకున్నారు. అందులో నాలుగు కేసులు లైంగిక వేధింపులకు సంబంధించినవే.

మహిళలు అన్ని సమయాల్లో ఎంతో దైర్యంగా ఉండాలని.. అందుకే ఈ అలారం వ్యవస్థకు దుర్గా అని పేరు పెట్టామని ప్రియ చెబుతోంది. అయితే.. ఈ అలారాలను వేధింపుల సమయంలోనే కాదు.. బస్సులో ఏవైనా దొంగతనాలు జరిగినా ప్రయాణికులు ఉపయోగిస్తున్నారని చెబుతోంది ప్రియ. త్వరలోనే ఈ అలారం సిస్టమ్స్‌ను బస్సుల జీపీఎస్ సిస్టమ్‌తో లింక్ చేస్తున్నట్టు ప్రియ వెల్లడించింది.

4317
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles