రాహుల్‌గాంధీ మళ్లీ కన్నుకొట్టారు..

Sun,August 12, 2018 04:19 PM

Rahul Gandhi winked again at a Rally in Jaipur

న్యూఢిల్లీ: ఆ మధ్య కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ లోక్‌సభలో ప్రధాని మోదీని కౌగిలించుకొని, తర్వాత కన్నుకొట్టడం ఎంత దుమారం రేపిందో మనకు తెలుసు. ఆ వివాదం ఇంకా సద్దుమణగనే లేదు.. రాహుల్ మరోసారి కన్నుకొట్టారు. ఈసారి జైపూర్‌లో జరిగిన ఓ సభలో ఆయన కన్నుకొడుతూ కెమెరాకు చిక్కారు. రాజస్థాన్‌లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పార్టీ తరఫున ప్రచారం చేయడానికి రాహుల్‌గాంధీ వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సచిన్ పైలట్‌ను చూసి రాహుల్ కన్నుకొట్టడం కెమెరాకు చిక్కింది. ఆ తర్వాత రాహుల్ పక్కనే ఉన్న పార్టీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్‌ను సచిన్ పైలట్ ఆలింగనం చేసుకున్నారు. రాహుల్ తన ప్రసంగం తర్వాత ఈ ఇద్దరిని ఒక దగ్గరికి తీసుకొచ్చారు. ఎన్నికల ముందు పార్టీలో ఎలాంటి చీలికలు, విభేదాలు లేవని చెప్పే ప్రయత్నం చేశారు.

4515
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles