నేడు కేరళకు రాహుల్‌ గాంధీ

Fri,June 7, 2019 09:23 AM

Rahul Gandhi visit to Wayanad today

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, వయనాడ్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీ నుంచి కేరళకు ప్రత్యేక విమానంలో బయల్దేరనున్నారు. వయనాడ్‌ నుంచి ఎంపీగా గెలుపొందిన తర్వాత రాహుల్‌ కేరళకు వెళ్లడం ఇదే తొలిసారి. ఇవాళ మధ్యాహ్నం కేరళకు వెళ్తున్నానని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. ఆదివారం అక్కడే ఉండి.. వయనాడ్‌ ప్రజలు, కాంగ్రెస్‌ కార్యకర్తలతో సమావేశం అవుతానని ఆయన తెలిపారు. ఈ మూడు రోజుల్లో రాహుల్‌ 15 కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. వయనాడ్‌లో రాహుల్‌ గాంధీ 4,31,063 ఓట్ల మెజార్టీతో ఎల్డీఎఫ్‌ అభ్యర్థి పీపీ సున్నీర్‌పై గెలుపొందారు. రాహుల్‌కు వయనాడ్‌లో 7,05,034 ఓట్లు వచ్చాయి. ఇక అమేథీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో రాహుల్‌ ఓటమి పాలైన విషయం తెలిసిందే.

711
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles