రాహుల్ నిరాహార దీక్ష.. జగదీష్ టైట్లర్ గెంటివేత..

Mon,April 9, 2018 01:22 PM

Rahul Gandhi to stage hunger strike, Jagadish Tytler asked to leave Rajghat

న్యూఢిల్లీ: దళితులపై జరుగుతున్న దాడులకు నిరసగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ నిరాహార దీక్ష చేపట్టింది. ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో ఉన్న మహాత్మాగాంధీ సమాధి వద్ద కాంగ్రెస్ పార్టీ ఈ దీక్ష చేపట్టనున్నది. కాసేపటి క్రితం రాహుల్ గాంధీ రాజ్‌ఘాట్‌కు వచ్చి గాంధీ సమాధి వద్ద నివాళి అర్పించారు. దళితులపై దాడిని ఖండిస్తూ రాహుల్ ఒక రోజు దీక్షలో కూర్చోనున్నారు. మతసామరస్యాన్ని ప్రమోట్ చేయాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ఈ దీక్ష చేపట్టింది.అయితే రాహుల్ వేదికకు రాకముందే అక్కడ హైడ్రామా చోటుచేసుకున్నది. మాజీ కేంద్ర మంత్రి జగదీశ్ టైట్లర్‌ను ఆ వేదిక నుంచి వెళ్లగొట్టారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య తర్వాత 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లలో టైట్లర్ ప్రధాన నిందితుడు. తనతో పాటు రాజీవ్ గాంధీ ఆ అల్లర్ల సమయంలో ఢిల్లీలో టూర్ చేశారని గత ఏడాది ఓ ఇంటర్వ్యూలో టైట్లర్ తెలిపారు. సిక్కు అల్లర్లకు కారణం టైట్లర్ అని ఓ దశాబ్ధం క్రితం నానావతి కమిషన్ ఇచ్చిన రిపోర్ట్‌లోనూ తేలింది.

1851
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles