రాహుల్ గాంధీ స్త్రీ ద్వేషి..

Thu,January 10, 2019 12:25 PM

Rahul Gandhi statement on defence minister Nirmala is misogynistic, says NCW chairperson Rekha Sharma

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీకి.. జాతీయ మ‌హిళా క‌మిష‌న్ ఇవాళ నోటీసులు జారీ చేసింది. ర‌క్ష‌ణ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు ఎన్‌సీడ‌బ్ల్యూ ఆరోపించింది. రాఫేల్ డీల్‌పై ప్ర‌ధాని మోదీ ఏమీ మాట్లాడ‌లేద‌ని, ఓ మ‌హిళా మంత్రిని అడ్డం పెట్టుకుని, పార్ల‌మెంట్‌లో త‌మ అభిప్రాయాలు వినిపించార‌ని రాహుల్ కొన్ని ట్వీట్ల‌లో విమ‌ర్శ‌లు చేశారు. ఆ ట్వీట్ల‌ను ఆధారం చేసుకుని .. ఇవాళ జాతీయ మ‌హిళా క‌మిష‌న్ రాహుల్‌కు నోటీసులు పంపించింది. సీతారామ‌న్‌పై చేసిన ట్వీట్ల‌కు వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఎన్‌సీడ‌బ్ల్యూ చైర్మ‌న్ రేఖా శ‌ర్మ డిమాండ్ చేశారు. రాహుల్ ట్వీట్లు శోచ‌నీయంగా, స్త్రీ ద్వేషిగా, సెక్సియెస్ట్‌గా ఉన్నాయ‌ని రేఖా శ‌ర్మ అన్నారు. అందుకే రాహుల్‌కు నోటీసులు పంపించిన‌ట్లు ఆమె చెప్పారు. మ‌హిళ‌ల ప‌ట్ల అనుచిత వ్యాఖ్య‌లు చేసిన ఆయ‌న.. వాటిపై వివ‌ర‌ణ ఇవ్వాల‌న్నారు.అయితే ప్ర‌ధాని మోదీపై చేసిన వ్యాఖ్య‌ల‌కు .. బీజేపీ కూడా సిరీయ‌స్‌గా స్పందించింది. రాహుల్ ఓ స్త్రీ ద్వేషిలా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని విమ‌ర్శించింది. మ‌రో ట్వీట్‌లో రాహుల్‌.. ప్ర‌ధాని మోదీని టార్గెట్ చేశారు. ఒక పురుషుడిలా త‌న‌ను ఎదుర్కోవాల‌న్నారు. మ‌హిళ‌ల‌ను గౌర‌వించ‌డం అనే సంస్కృతి మ‌న ఇంట్లోనే మొద‌ల‌వుతుంద‌ని, ఊగిస‌లాట ఆప‌మ‌ని, ధైర్యంగా త‌న‌ ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబు ఇవ్వాల‌ని మోదీని రాహుల్ ప్ర‌శ్నించారు.


మంత్రి సీతారామ‌న్‌పై రాహుల్ చేసిన వ్యాఖ్య‌ల‌ను మ‌రో మంత్రి సుష్మా స్వ‌రాజ్ త‌ప్పుప‌ట్టారు. ఆ వ్యాఖ్య‌ల‌తో భార‌త రాజ‌కీయాలు మ‌రింత లోతుకు దిగ‌జారాయ‌న్నారు.


1381
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles