రాహుల్ గాంధీయే కొనసాగాలని కోరుకుంటున్నారు..

Thu,June 20, 2019 07:36 PM

Rahul Gandhi should continue as Congress President says CM Bhupesh Baghel


న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఛత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ బాఘేల్ కలిశారు. న్యూఢిల్లీలోని నివాసంలో రాహుల్ తో సీఎం భూపేశ్ బాఘేల్ సమావేశమయ్యారు. అనంతరం భూపేశ్ బాఘేల్ మాట్లాడుతూ..రాహుల్ గాంధీయే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటున్నారన్నారు. రాహుల్ నాయకత్వంపై కాంగ్రెస్ కార్యకర్తలకు ఎలాంటి అనుమానం అవసరం లేదన్నారు. అందరినీ కలిపి ముందుకు తీసుకెళ్లే సామర్థ్యం రాహుల్ గాంధీకి ఉందని సీఎం భూపేశ్ బాఘేల్ స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని ఇటీవలే ప్రకటించిన రాహుల్..కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎవరు పోటీ పడ్డా తాను మాత్రం అడ్డుపడేది లేదని తాజాగా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

1807
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles