బీజేపీపై రోజూ పోరాడుతూనే ఉంటాం..

Sat,June 1, 2019 11:35 AM

Rahul Gandhi says congress will fight with bjp every day

హైద‌రాబాద్: కాంగ్రెస్ పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశం ఇవాళ జ‌రిగింది. ఆ స‌మావేశంలో పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ మాట్లాడారు. కాంగ్రెస్ వ‌ర్క‌ర్ల‌కు, ఓట‌ర్ల‌కు ఆయ‌న ధ‌న్య‌వాదాలు తెలిపారు. రాజ్యాంగ ప‌రిర‌క్ష‌ణ కోసం పోరాటం చేస్తున్నామ‌న్న విష‌యాన్ని ప్ర‌తి ఒక కాంగ్రెస్ కార్య‌క‌ర్తు గుర్తుపెట్టుకోవాల‌ని రాహుల్ అన్నారు. విశ్వాసాల‌కు, వ‌ర్ణాల‌కు తేడా లేకుండా ప్ర‌తి ఒక‌రు పోరాటం చేయాల‌న్నారు. ప్ర‌తి రోజూ బీజేపీపై పోరాటం చేస్తూనే ఉండాల‌న్నారు. ఈ విష‌యాన్ని కాంగ్రెస్ నేత సుర్జేవాలా త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో తెలిపారు. ఇవాళ జ‌రిగిన స‌మావేశంలో పార్ల‌మెంట‌రీ పార్టీ చీఫ్‌గా సోనియా గాంధీని ఎన్నుకున్నారు. కాంగ్రెస్ పార్టీపై న‌మ్మ‌కం ఉంచిన 12.13 కోట్ల ఓట‌ర్ల‌కు సోనియా థ్యాంక్స్ చెప్పారు.

3439
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles