HomeLATEST NEWSRahul Gandhi refers Mijoram as Manipur in his tweet roasted by BJP

మిజోరం, మణిపూర్‌కు తేడా తెలియని రాహుల్‌గాంధీ!

Published: Tue,October 30, 2018 11:46 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మరోసారి బీజేపీకి దొరికిపోయారు. మిజోరంలో కొందరు బాలికలను అభినందిస్తూ రాహుల్ ఓ ట్వీట్ చేశారు. అయితే ఆ ట్వీట్‌లో మిజోరం బదులు మణిపూర్ అని రాశారు. ఈ పొరపాటును వెంటనే పసిగట్టిన బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ.. రాహుల్‌పై సెటైర్ వేశారు. ఈశాన్య రాష్ర్టాల గురించి రాహుల్‌కు ఏమీ తెలియదని దీనిని బట్టి అర్థమవుతున్నదని, ఈ పొరపాటే చాలా సమస్యాత్మకమైనదని అమిత్ ట్వీట్ చేశారు. ఇది చూసి కాంగ్రెస్ వెంటనే ఆ ట్వీట్‌ను తొలగించినా.. బీజేపీ మాత్రం తన దాడిని కొనసాగించింది. ఈసారి అమిత్ మరో ట్వీట్ చేస్తూ రాహుల్‌కు ఓ శిక్ష కూడా వేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నంత వరకు ఈశాన్య భారతంలో మణిపూర్, మిజోరం వేర్వేరు రాష్ర్టాలని గుర్తుంచుకుంటా అని వందసార్లు రాయండి అంటూ అమిత్ ట్వీట్ చేశారు. రాహుల్ గతంలోనూ ఇలాగే పలు పొరపాట్లు చేసిన సమయాల్లో బీజేపీ సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే.


1178
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology