పరువునష్టం కేసులో రాహుల్‌కు బెయిల్‌ మంజూరు

Fri,July 12, 2019 04:51 PM

న్యూఢిల్లీ: పరువునష్టం దావా కేసులో ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి గుజరాత్‌ మెట్రో పాలిటన్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అహ్మదాబాద్‌ జిల్లా కో ఆపరేటీవ్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌ అజయ్‌ పటేల్‌ ఈ కేసును దాఖలు చేశారు. విచారణ నిమిత్తం రాహుల్‌ ఈ ఉదయం అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ.. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలానికి వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు అవకాశం కల్పించిన ప్రత్యర్థులకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. నోట్ల రద్దు సమయంలో అహ్మదాబాద్‌ కో ఆపరేటీవ్‌ బ్యాంక్‌ రూ. 745.59 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డట్లుగా రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్‌ సింగ్‌ సుర్జేవాలా ఆరోపించారు. బ్యాంక్‌ అప్పటి డైరెక్టర్లలో అమిత్‌ షా ఒకరు. నిరాధార ఆరోపణలు చేసి తమ పరువుకు నష్టం కలిగించారన్న ఫిర్యాదు మేరకు కోర్టు వీరివురికి సమన్లు జారీ చేసింది. ముంబయికి చెందిన ఓ వ్యక్తి ఆర్‌టీఐ ద్వారా నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రాహుల్‌ గాంధీ, సుర్జేవాలా ఈ ఆరోపణలు చేసినట్లుగా సమాచారం.

610
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles