వ‌య‌నాడ్‌లో నామినేష‌న్ వేసిన రాహుల్‌

Thu,April 4, 2019 12:18 PM

Rahul Gandhi files nomination from Wayanad

హైద‌రాబాద్: కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ.. ఇవాళ కేర‌ళ‌లోని వ‌య‌నాడ్‌లో నామినేష‌న్ దాఖ‌లు చేశారు. యూపీలోని అమేథీతో పాటు వ‌య‌నాడ్‌లోనూ రాహుల్ లోక్‌స‌భ‌కు పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. వ‌య‌నాడ్‌లోని క‌లెక్ట‌ర్ ఆఫీసులో కాసేప‌టి క్రితం రాహుల్ త‌న నామినేష‌న్ అంద‌జేశారు. ఏఐసిసి జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ, సోద‌రి ప్రియాంకా గాంధీ కూడా రాహుల్‌తో ఉన్నారు. నామినేష‌న్ త‌ర్వాత వ‌య‌నాడ్ వీధుల్లో రాహుల్ రోడ్ షో చేశారు. నిన్న కోజికోడ్ చేరుకున్న రాహుల్‌, ప్రియాంకాలు.. ఇవాళ ఉద‌యం ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌లో వ‌య‌నాడ్ చేరుకున్నారు. ఈనెల 23న వ‌య‌నాడ్ స్థానానికి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

630
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles