హిందువులంటే రాహుల్ భ‌య‌ప‌డుతున్నారు : మోదీ

Mon,April 1, 2019 05:37 PM

Rahul Gandhi fighting from Wayanad as Congress is now scared of Hindus, says PM Modi

హైదరాబాద్: హిందూ మ‌త‌స్తులను చూసి రాహుల్ గాంధీ భ‌య‌ప‌డుతున్నార‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు. అందుకే ముస్లిం మెజారిటీ ఉన్న వ‌య‌నాడ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీలో నిలుచున్నార‌ని మోదీ విమ‌ర్శించారు. యూపీలోని అమేథీతో పాటు కేర‌ళ‌లోని వ‌య‌నాడ్ నుంచి పోటీ చేయాల‌ని రాహుల్ నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే. అయితే అమేథీలో ఓట‌మి త‌ప్ప‌ద‌ని భ‌య‌ప‌డిన రాహుల్‌.. ముస్లిం మ‌త‌స్తులు మెజారిటీ సంఖ్య‌లో ఉండే వ‌య‌నాడ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీకి దిగుతున్న‌ట్లు మోదీ విమ‌ర్శించారు. వ‌య‌నాడ్ నుంచి ఎన్డీఏ అభ్య‌ర్థిగా తుషార్ పోటీ చేస్తున్నారు. హిందువులు మెజారిటీగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థులు పోటీ చేసేందుకు జంకుతున్నార‌ని మోదీ అన్నారు. హిందూ టెర్ర‌ర్ అన్న ఆరోప‌ణ‌ల‌తో హిందువుల మ‌నోభావాల‌ను కాంగ్రెస్ పార్టీ కించ‌ప‌రిచింద‌న్నారు. శాంతి కాముకులైన హిందువుల‌ను కాంగ్రెస్ పార్టీ ఉగ్ర‌వాదులుగా మార్చింద‌న్నారు. హిందువులు గుణ‌పాఠం చెబుతార‌న్న ఉద్దేశంతోనే ఇలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటుంద‌న్నారు. మ‌హారాష్ట్రలో జ‌రిగిన ర్యాలీలో మోదీ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

865
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles