రాహుల్ మాత్రమే బయటపడేయగలరు: శశిథరూర్

Tue,May 28, 2019 09:56 PM

Rahul Gandhi best person to lead party says shashi tharoor


న్యూఢిల్లీ : లోక్ సభ ఎన్నికల్లో ఓటమి పాలైన నేపథ్యంలో ఇక కాంగ్రెస్ పని అయిపోయిందని కొం‍దరు వ్యాఖ్యానించడంపై ఆ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ స్పందించారు. అలాంటివి చాలా తొందరపాటు వ్యాఖ్యలని శశిథరూర్ అభిప్రాయపడ్డారు. వందల ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీని ఈ లోక్ సభ ఫలితాలు కూల్చలేవని శశిథరూర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీని క్లిష్ట పరిస్థితుల్లోంచి రాహుల్‌ గాంధీ మాత్రమే బయట పడేయగలరన్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఓటమిని తల్చుకుంటూ బాధపడే కన్నా..వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం సిద్దం కావడం మంచిదని సూచించారు. అంతేకాకుండా పార్టీ కోరితే.. తాను లోక్‌సభలో కాంగ్రెస్‌ ప్రతి పక్ష నేతగా బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

1331
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles