మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్

Tue,June 4, 2019 04:47 PM

Radhakrishna Vikhe Patil on his resignation as Congress MLA

ముంబై : ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీని వీడేందుకు పలువురు ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాధాకృష్ణ విఖే పాటిల్.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను మహారాష్ట్ర విధాన సభ స్పీకర్‌కు కూడా సమర్పించారు రాధాకృష్ణ. అనంతరం ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను రాధాకృష్ణ కలిశారు. అయితే త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో రాధాకృష్ణకు చోటు దక్కే అవకాశం ఉన్నట్లు వార్తలు షికారు చేస్తున్నాయి. మరో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. బీజేపీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవల జరిగిన మహారాష్ట్ర లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమి 48 స్థానాలకు గాను 41 గెలుచుకోగా, ఎన్సీపీకి నాలుగు సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ ఒక్క సీటుకు మాత్రమే పరిమితమైంది.

2519
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles