కస్టమర్లు కాదు.. డెలివరీ బాయ్స్‌.. బావర్చీ ముందు జొమాటో బాయ్స్‌ క్యూ.. ఫోటో వైరల్‌

Sat,April 13, 2019 12:11 PM

Queue Of Zomato Delivery People Outside Hyderabad Restaurant photo goes viral

ఇది టెక్నాలజీ యుగం. చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటే చాలు. ప్రపంచం మొత్తం మన చేతిలోనే ఉంటుంది. ఇంట్లో కూర్చొని ప్రపంచాన్ని చుట్టేయొచ్చు. షాపింగ్‌ కూడా ఇంట్లో కూర్చొనే చేయొచ్చు. అలాగే ఫుడ్‌ కూడా ఈరోజుల్లో వండుకొనే తినాల్సిన అవసరం లేకుండా ఫుడ్‌ డెలివరీ యాప్స్‌ వచ్చాయి. చిటికెలో బుక్‌ చేసుకొని కావాల్సిన ఆహార పదార్థాలను ఇంటికే తెప్పించుకొని తినే సౌకర్యం ఇప్పుడు మనకు అందుబాటులో ఉంది. ఇండియాలోని ఫేమస్‌ మెట్రో సిటీలతో పాటు టైర్‌ 2 నగరాల్లోనూ ఫుడ్‌ డెలివరీ యాప్స్‌ తమ సేవలందిస్తున్నాయి.

వాటిలో స్విగ్గీ, జొమాటో, ఉబెర్‌ ఈట్స్‌, ఫాసూస్‌ లాంటివి ఫేమస్‌ ఫుడ్‌ డెలివరీ యాప్స్‌. పోటీని తట్టుకోవడం కోసం, కస్టమర్లను ఆకర్షించడం కోసం ఈ యాప్స్‌ ఎన్నో ఆఫర్లు ఇస్తుంటాయి. డిస్కౌంట్లు ఇస్తుంటాయి. దీంతో ఎక్కువ శాతం ప్రజలు యాప్‌నే ఉపయోగించి ఫుడ్‌ను ఆర్డర్‌ చేస్తున్నారు. దానికి ఉదాహరణే మీరు పైన చూస్తున్న ఫోటో.

అవును.. హైదరాబాద్‌లోని ఫేమస్‌ బిర్యానీ రెస్టారెంట్‌ బావర్చి ముందు జొమాటో డెలివరీ బాయ్స్‌ క్యూ అది. వాళ్లు కస్టమర్లు కాదు. డెలివరీ బాయ్స్‌. ఎంత పెద్ద క్యూ ఉందో చూశారా? దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డర్‌కు ఎంత డిమాండ్‌ ఉందో. మీరు పైన చూస్తున్న ఆ ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫోటోను జొమాటో తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేసి.. ఏ రెస్టారెంట్‌కు ఇంత పెద్ద క్యూ ఉంటుంది చెప్పండి అంటూ ఓ క్వశ్చన్‌ వేసింది.హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లో ఉన్న బావర్చీ బిర్యానీ రెస్టారెంట్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు కదా. ఆ రెస్టారెంట్‌లో జొమాటో ద్వారా వచ్చే ఆర్డర్సే 2 వేలకు పైనే ఉంటాయట. అందుకే క్యూ చూశారా ఎంత పెద్దగా ఉందో?


ఇక.. జొమాటో గురించి చెప్పాలంటే.. ప్రస్తుతం దేశంలోని 63 సిటీల్లో జొమాటో తన సేవలను విస్తరించింది. అందులో మెట్రో నగరాలతో పాటు రెండో శ్రేణి నగరాలు కూడా ఉన్నాయి. ఇక.. జొమాటోకు ఎక్కువగా మిడ్‌నైట్‌ ఆర్డర్స్‌ ముంబై నుంచి కాకుండా ఇండోర్‌ నుంచి వస్తున్నాయట. ఆంధ్ర ప్రదేశ్‌లోని విజయవాడ నుంచి ఎక్కువ బ్రేక్‌ ఫాస్ట్‌ ఆర్డర్స్‌ వస్తాయట. ఇంత‌కీ మీరు ఎక్కువగా జొమాటో నుంచి ఏం ఆర్డర్‌ చేస్తారు. బిర్యానీయే కదా?

6094
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles