కొండచిలువను కోసి.. మహిళను బయటకు తీశారు.. వీడియో

Tue,June 19, 2018 10:58 AM

python slained after swallowing woman in Southeast Sulawesi

జకర్తా: ఇండోనేషియాలో ఓ భారీ కొండచిలువ ఓ మహిళను మింగిన సంగతి తెలిసిందే. మునా ఏజెన్సీలో ఈ ఘటన జరిగింది. 8 మీటర్ల కొండచిలువను కోయగా.. దాని కడుపులో 54 ఏళ్ల వా తిబా అనే గృహిణి శరీరం బయటపడింది. కొండచిలువను కోసి మహిళను బయటకు తీస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అసలేం జరిగింది


ఇంటి నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్న మొక్క జోన్న చేనుకు వెళ్లిన తర్వాత ఆమె కనిపించకుండాపోయింది. పందులు పంటను నాశనం చేస్తున్నాయని, వాటిని వెళ్లగొట్టాలన్న ఉద్దేశంతో ఆమె తన ఇంటి వద్ద ఉన్న మొక్క జొన్న చేనుకు వెళ్లింది. ఆ సమయంలో ఆమె అదృశ్యమైనట్లు తెలిసింది. మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కూడా ఆమె తిరిగిరాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో గ్రామస్తులు ఓ భారీ పైతాన్‌ను కనుగొన్నారు. ఆ కొండచిలువను కోయడంతో దాని కడుపులో నుంచి ఆ మహిళ మృతదేహం బయటపడింది.

వీడియో కోసం క్లిక్ చెయండి

7356
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles