పంజాబీ ట్రాఫిక్ పోలీస్‌ సందేశాత్మక పాట..వీడియో

Tue,September 3, 2019 07:33 PM

Punjab traffic Cop Message For Drivers with punjabi song


న్యూఢిల్లీ: మోటార్ వెహికిల్ చట్టం సవరణ తర్వాత సెప్టెంబర్ 1 నుంచి కొత్త ట్రాఫిక్ నియమనిబంధనలు అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. వాహనదారులు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించొద్దని పంజాబ్ పోలీస్ అధికారి విజ్ఞప్తి చేస్తున్నారు. చండీగఢ్ లో ట్రాఫిక్ పోలీస్ భూపిందర్ సింగ్ పంజాబీ పాటను పాడుతూ బైకర్లకు, ఇతర వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలను పాటించాల్సిన ప్రాముఖ్యతను తెలియజేస్తున్నారు.

‘18 ఏళ్లలోపు యువత వాహనాలను నడపొద్దు..లేదంటే వారి తల్లిదండ్రులు సమస్యలు ఎదుర్కొంటారు. ఎంతోమంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. జరిమానా తక్కువ ఉండటం వల్ల ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించాలంటే ప్రజలు భయపడటం లేదు. ఇపుడు జరిమానాలు పెంచినందున..ఎవరూ ఫిర్యాదు చేయొద్దు’ అంటూ పాటతో అందరినీ అప్రమత్తం చేశారు. ఈ వీడియోను చంఢీగఢ్ ట్రాఫిక్ పోలీసులు ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.

1223
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles