దుస్తులు విప్పమని అడిగిన హాస్టల్‌ వార్డెన్స్‌

Wed,May 1, 2019 11:02 AM

Punjab Students Allegedly Made To Strip In Hostel Over A Sanitary Pad

హైదరాబాద్‌ : యూనివర్సిటీ విద్యార్థినుల పట్ల ఇద్దరు హాస్టల్‌ వార్డెన్స్‌ అమానుషంగా ప్రవర్తించారు. శానిటరీ ప్యాడ్స్‌ వాడి ఎవరూ పడేశారో తెలుసుకునేందుకు దుస్తులు విప్పమని అమ్మాయిలను వార్డెన్స్‌ వేధించారు. ఈ సంఘటన పంజాబ్‌లోని అకాల్‌ యూనివర్సిటీలో చోటు చేసుకుంది. ఉపయోగించిన శానిటరీ ప్యాడ్స్‌ను హాస్టల్‌ వాష్‌రూమ్‌లో పడేశారు. దీంతో ఇద్దరు హాస్టల్‌ వార్డెన్స్‌, ఇద్దరు మహిళా సెక్యూరిటీ గార్డులు కలిసి.. విద్యార్థినులను వేధింపులకు గురి చేశారు. శానిటరీ ప్యాడ్స్‌ ఎవరూ పడేశారో తెలుసుకునేందుకు హాస్టల్‌లోని విద్యార్థినులందరినీ దుస్తులు విప్పాలని వార్డెన్స్‌ ఆదేశించారు. ఈ క్రమంలో అమ్మాయిలందరూ నిరసన వ్యక్తం చేశారు. దీనిపై యూనివర్సిటీ డీన్‌ ఎంఎస్‌ జోహల్‌కు విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరు వార్డెన్స్‌, సెక్యూరిటీ గార్డులను విధుల నుంచి తొలగించారు. ఈ ఘటనపై కమిటీ వేశామని జోహల్‌ తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని యూనివర్సిటీ డీన్‌ పేర్కొన్నారు.

5366
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles